Header Banner

తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు! చార్‌ధామ్ యాత్ర షురూ!

  Fri May 02, 2025 10:59        Devotional

దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- కేదార్‌నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. కేదార్‌నాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు.



ఇప్పుడు తాజాగా కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేదారనాథుడికి తొలి పూజలు చేశారు.

 

ఇది కూడా చదవండి: హైకోర్టు సంచలన తీర్పు! మతం మారితే వారికి ఇక అవి వర్తించవు!



తొలుత ప్రధాన అర్చకుడు రావల్ భీమశంకర్ స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజావస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. ఆ తరువాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. శివాష్టకం, శివతాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ఆలయ ప్రాగణం మొత్తం ప్రతిధ్వనించింది. మొత్తం 2,500 మంది భక్తులు తొలి పూజల్లో పాల్గొన్నారు. కేదారేశ్వరుడి నామస్మరణ చేస్తూ అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. అంతకుముందు- పంచముఖి విగ్రహాన్ని ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుండి ఉత్సవంగా కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు. పల్లకీ సేవ నిర్వహించారు. విగ్రహాన్ని డోలిపై ఉంచే ముందు సాంప్రదాయ పంచ స్నానం కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేశారు. తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. 13 టన్నుల పూలను దీనికోసం వినియోగించారు.


కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరచుకోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది. వీడియోలు తీయడంపైనా నిషేధం జారీ అయింది. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆలయం పునఃప్రారంభ వేడుకలను ఇందులో నుంచి మినహాయించారు. చార్ ధామ్ యాత్రపై ఉద్దేశపూరకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Kedarnath #CharDhamYatra #KedarnathOpening #CharDhamRegistration #SpiritualJourney #DevBhoomi